తాజా వార్తలు

మోసాల పునాదులపై టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మోసాల పునాదులపై టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

uttam

కేసీఆర్‌ సర్కారు రెండో విడతలో మొదటి సంవత్సరం పాలన అన్ని రంగాల్లో విఫలమైందని.. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చకుండా.. రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మోసాల పునాదులపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన దిశ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్‌.. జిల్లాలో మినరల్‌ ఫండ్స్‌ ఖర్చు ఏకపక్షంగా జరుగుతోందని విమర్శించారు.

Next Story

RELATED STORIES