పదోతరగతి విద్యార్ధులకు శుభవార్త.. గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు.. అప్లైకి ఆఖరు..

పదోతరగతి విద్యార్ధులకు శుభవార్త.. గురుకుల కాలేజీల్లో అడ్మిషన్లు.. అప్లైకి ఆఖరు..

gurukul-college

మార్చిలో టెన్త్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తెలంగాణాలోని గురుకుల కళాశాలలో ఇంటర్ చదవాలనుకుంటే ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెలంగాణ సోషల్ వెల్‌పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ-TSWREIS, తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ-TTWREIS దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీల్లో ఇంటర్మీడియట్‌లో అడ్మిషన్ల కోసం ప్రవేవ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలు, కోర్సులు, సీట్ల వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబరు 20 ఆఖరు తేదీ. ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన హాల్‌టికెట్లు డిసెంబర్ 25 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2020 జనవరి 5న TSWREIS ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ 1 జరుగుతుంది. 2020 ఫిబ్రవరి 9న ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ 2 జరుగుతుంది. TTWREISకు సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ లెవెల్ 1 జనవరి 12న, లెవెల్ 2 ఫిబ్రవరి 16న జరుగుతుంది. ఎంపికైన విద్యార్థుల జాబితాను 2020 మార్చి 30న విడుదల చేస్తారు. 2020 జూన్ 1 2020-2021 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు ప్రారంభమవుతాయి. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ సిలబస్‌తో 10 వ తరగతి రాసే విద్యార్థులు ఎంట్రెన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేయడానికి అర్హులు. 2020 మార్చిలో ఎస్ఎస్‌సీలో A1 నుంచి B2 వరకు గ్రేడ్ పొందనివారు సెంటర్ ఆప్ ఎక్స్‌లెన్స్ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం అర్బన్ విద్యార్ధులకు రూ.2,00,000 లోపు, రూరల్ విద్యార్థులకు రూ.1,50,000 లోపు ఉండాలి. తెలుగు లేదా ఇంగ్లీష్ మీడియం చదువుతున్న విద్యార్థులు ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. విద్యార్థుల వయసు 2020 ఆగస్ట్ 31 నాటికి 17 ఏళ్లు మించకూడదు. ఎస్సీ విద్యార్థులు, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్లకు వయసులో 2 ఏళ్లు సడలింపు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం TSWREIS అధికారిక వెబ్‌సైట్ https://www.tswreis.in/ లేదా TTWREIS అధికారిక వెబ్‌సైట్ http://tgtwgurukulam.telangana.gov.in చూడొచ్చు.

Read MoreRead Less
Next Story