అంతర్జాతీయం

పాక్‌కు భారత్, అమెరికా సీరియస్ వార్నింగ్

పాక్‌కు భారత్, అమెరికా సీరియస్ వార్నింగ్
X

2

భారత్ పై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌ కు.. భారత్, అమెరికా సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న దాయాదిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకపోతే.. ఇబ్బందులు తప్పవంటూ హెచ్చరించాయి. పఠాన్‌ కోట్, ముంబయి తరహా దాడులకు పాల్పడిన టెర్రిస్టులను శిక్షించాల్సిన బాధ్యత పాక్‌ దేనని స్పష్టం చేశాయి.

వాషింగ్టన్ లో జరుగుతున్న టూ ప్లస్‌ టూ చర్చల్లో ఇరు దేశాలు పలు అంశాలపై చర్చించాయి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మసూద్‌ అజర్‌ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలో సహకరించిన అమెరికాను.. భారత్ అభినందించింది. మరోవైపు, ఉగ్రవాదులను గుర్తించేలా.. చట్టాల్లో మార్పులు చేయడంపై భారత్ ను అమెరికా కొనియాడింది. అంతకుముందు, భారత్‌ తరఫున మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్, జైశంకర్‌.. అమెరికా మంత్రులు మైక్‌ పాంపియో, మార్క్ ఎస్పర్ తో విస్తృత స్థాయి చర్చలు జరిగాయి.

Next Story

RELATED STORIES