గూగుల్‌లో 3800 ఉద్యోగాలు..

గూగుల్‌లో 3800 ఉద్యోగాలు..

google-jobs

గూగుల్ భారతదేశంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది 3800 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారతదేశంలోని అన్ని గూగుల్ కార్యాలయాల్లో వీరిని నియమించనుంది. గూగుల్ ఎక్కవగా తక్కువ వేతనంతో పని చేసే ఉద్యోగులపై థర్డ్ పార్టీ టెంపరరీ వర్కర్స్‌పై ఆధారపడుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉద్యోగులను నియమించాలని సంస్థ నిర్ణయించింది. కస్టమర్ కేర్ సపోర్ట్ కోసం వీరిని నియమించనుంది. ప్రస్తుతం కస్టమర్ సపోర్ట్, యూజర్ సపోర్ట్, యూజర్స్‌తో కాల్స్ మాట్లాడడం, ప్రొడక్ట్ ట్రబుల్ షూటింగ్, క్యాపైన్ లాంటి వాటికి థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడుతోంది గూగుల్. కస్టమర్లకు, యూజర్లకు సేవలు అందించేందుకు 2018 లో గూగుల్ పైలెట్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఇన్ హౌజ్ ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇకపై థర్డ్ పార్టీపై ఆధారపడకుండా కస్టమర్ సపోర్ట్ ఏజెంట్లను నియమించనుంది. వీరికి గూగుల్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, బెనిఫిట్స్, మూడు వారాల పెయిడ్ వెకేషన్, 22 వారాల పెయిడ్ పేరెంటల్ లీవ్, సమగ్రమైన హెల్త్ కేర్ లాంటి బెనిఫిట్స్ లభిస్తాయి.

Read MoreRead Less
Next Story