ఆంధ్రప్రదేశ్

కేబినెట్‌ నిర్ణయం తరువాత బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం: కన్నా

కేబినెట్‌ నిర్ణయం తరువాత బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం: కన్నా
X

kanna

రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కేబినెట్‌ నిర్ణయం తరువాత బీజేపీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రైతులు ఇచ్చిన భూములు అమ్మడానికే జగన్ సిద్ధమయ్యారని.. రాజధాని వైసీపీ జాగీరు కాదని కన్నా మండిపడ్డారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ ఉద్దండరాయునిపాలెంలో మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌన దీక్ష చేపట్టారు కన్నా.

ఏపీ రాజధానిని అమరావతిలో ఉంచాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. గత ప్రభుత్వ అక్రమాలను సాకుగా చూపుతూ ఏకంగా రాజధానిని అమ్మేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఈ రాష్టాన్ని జగన్ నిట్టనిలువునా ముంచుతారని ప్రజలు ఊహించలేదన్నారు కన్నా.

Next Story

RELATED STORIES