టెక్నాలజీ మహిమ.. అన్నీ మీ 'మాట' వినేస్తాయ్..

టెక్నాలజీ మహిమ.. అన్నీ మీ మాట వినేస్తాయ్..

speech-recognition

మాట వినట్లేదని మీ పిల్లాడి మీద కంప్లైంట్ ఇస్తారేమోగానీ.. మీ కంప్యూటర్, మీ టీవీ, మీ కారు, మీ ఏసి మీద కాదు.. అవన్నీ ఇక నుంచి మీ మాట వింటాయ్. మీరు ఆన్ అనగానే ఆన్ అవుతాయి.. ఆఫ్ అనగానే ఆగిపోతాయి. వాయిస్ కంట్రోల్/వాయిస్ కమాండ్ పేరుతో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. ఇకపై మనుషుల అవసరం తక్కువగా ఉంటుంది. మాటల అవసరం ఎక్కువగా ఉంటుంది.

కంప్యూటర్ ముందు కూర్చుని చెబితే చాలు స్క్రీన్ మీద లెటర్లు ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు ఇంట్లో లైట్ వేయాలంటే ఎవర్నీ బతిమాలక్కర్లేదు.. టీవీ ముందు కూర్చుని రిమోట్ ఎక్కడుందని వెతుక్కోవాల్సిన పన్లేదు. మీ నోట్లో నుంచి మాట వస్తే చాలు.. మరు నిమిషంలో పనైపోతుంది. అంతేకాదండోయ్ ఇంగ్లీషులో ఉన్న స్క్రిప్ట్‌ని హిందీలో మార్చు అని ఒక్క మాట చెబితే చాలు బుద్దిగా మార్చేస్తుంది. ఇప్పటికైతే ఇది లేటెస్ట్ అప్‌డేట్.. ముందు ముందు ఇంకేం వినాల్సొస్తుందో.. టెక్నాలజీ గురూ.. వాడుకోవాలి.. అంతే మరి.

Read MoreRead Less
Next Story