Top

గద్దె రామ్మోహన్ రావు దీక్షకు చంద్రబాబు సంఘీభావం

గద్దె రామ్మోహన్ రావు  దీక్షకు చంద్రబాబు సంఘీభావం
X

babu

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు నిరసన దీక్ష చేపడుతున్నారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో రామ్మోహన్‌రావు దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు పార్టీలకతీతంగా అంతా మద్దతు తెలుతుపుతున్నారు. గద్దె చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు సంఘీభావం తెలిపారు. దీక్షా వేదిక వద్దకు వెళ్లి అక్కడే కూర్చున్నారు. ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజధాని తరలింపు అమరావతి గ్రామాల సమస్య మాత్రమే కాదని.. ఐదు కోట్ల ఆంధ్రులు అమరావతి కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కమిటీల పేరు చెప్పి రాజధానిని తరలించేందుకు కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES