మున్సి'పోల్స్' పై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై గులాబి బాస్ కేసీఆర్ ఫోకస్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజవకర్గ ఇన్‌ఛార్జులకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మున్సిపల్లో ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు వివరిస్తున్నారు. నామినేషన్ల నుంచి పోలింగ్ తేదీ వరకు అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమరపాటు వద్దని హెచ్చరించారు. పార్టీలో రెబల్స్ లేకుండా చూసుకోవాలని సూచించారు. అలాగే పోటీ చేసే అభ్యర్థులకు ఎమ్మెలతోనే బీఫామ్‌లు అందించనున్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆలస్యంగా వచ్చారు. మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, కొప్పులు ఈశ్వర్‌లు.. ఎమ్మెల్యేలు పద్మా దేవందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, కాలయాదయ్య, రసమయిలతో పాటు మరో 20 మంది ఎమ్మెల్యేలు ఆలస్యంగా సమావేశానికి హాజరవ్వడంతో వారి తీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com