సీబీఐ కోర్టులో కీలక విచారణ.. హాజరు కాని సీఎం జగన్

సీబీఐ కోర్టులో కీలక విచారణ.. హాజరు కాని సీఎం జగన్
X

cm-jagan

ఏపీ సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టులో కీలక విచారణ జరగనుంది. అయితే ఈ విచారణకు సీఎం జగన్ హాజరుకాలేదు. ఆయన హాజరు కావడం లేదంటూ న్యాయవాదులు మరోసారి డిస్పెన్స్‌ పిటిషన్‌ వేశారు. అధికారిక కార్యక్రమంలో ఉన్నందున హాజరు కాలేకపోతున్నట్టు పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు పెన్నాసిమెంట్‌ అనుబంధ ఛార్జిషీట్‌లో.. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐ.ఎ.ఎస్ అధికారి శ్రీ లక్ష్మి, వీడీ రాజగోపాల్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌, DRO సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ ఎల్లమ్మ హాజరయ్యారు.

Tags

Next Story