మున్సిపల్ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాల్: కేటీఆర్

మున్సిపల్ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాల్: కేటీఆర్

ktr

కాంగ్రెస్‌ పరిపాలనలో చెత్త మున్సిపాలిటీలు.. TRS పాలనలో కొత్త మున్సిపాలిటీలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ అన్నారు. ఆచరణ సాధ్యంకాని అంశాలను మేనిఫెస్టోలో పెట్టి తెలివి తక్కువతనం ప్రదర్శనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పచ్చదనం-పారిశుధ్యం తమ ప్రధాన అంశమన్నారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామన్నారు కేటీఆర్‌. అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించేదిలేదన్నారు. సీఎం కేసీఆర్‌ మనసులో ఇంకా అనేక సంక్షేమ పథకాలున్నాయని.. ఐదు రూపాయల భోజనాన్ని జానారెడ్డి తిని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. మున్సిపల్‌ మంత్రిగా ఈ ఎన్నికలు తనకు సవాలు వంటివని చెప్పారు కేటీఆర్‌.

వచ్చే నాలుగేళ్లలో పట్టణాల అభివృద్ధే తమ లక్ష్యమన్నారు కేటీఆర్‌. TS I-PASS మాదిరిగా పట్టణాల కోసం TS B-PASS చేపడతామన్నారు. MIMతో తమకు పొత్తుల్లేవని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమకు ప్రత్యర్థే అన్నారు. MIM పోటీ చేసే చోట TRS కూడా పోటీ చేస్తుందన్నారు కేటీఆర్‌. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎందుకు నిలపలేకపోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ కలసి పనిచేస్తూ పైకి డ్రామాలు ఆడుతున్నాయని ఫైరయ్యారు.

స్మార్ట్ సిటీలు ఇస్తామన్న కేంద్రం.. ఎన్ని సిటీలు ఇచ్చిందో చెప్పాలన్నారు. బీజేపీకి బిఫామ్‌లు ఇచ్చిన అభ్యర్థులు కూడా కాపాడుకునే పరిస్థితి లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లు కొన్ని చోట్ల పరస్పర అంగీకారానికి వచ్చాయన్నారు. స్థానిక అంశాలను పక్కనబెట్టి.. పౌరసత్వంపై బీజేపీ మాట్లాడం సిగ్గుచేటన్నారు కేటీఆర్‌. 18 వేల కోట్లతో తెలంగాణలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇళ్ల నిర్మాణం ఎలా ఉందో చూపగలరా అని బీజేపీని ప్రశ్నించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు కేటీఆర్‌. రాష్ట్రంలో ఆర్థికమాంద్యం తరుముతున్నా.. భారం పడే అంశాలు పరిశీలిస్తూ ముందుకెళుతున్నామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story