కేసీఆర్‌కి దమ్ముంటే నామీద చర్యలు తీసుకోవాలి.. డి. శ్రీనివాస్ సవాల్

తండ్రి, కొడుకు, కూతురు బాగుపడినంత మాత్రాన.. బంగారు తెలంగాణ సాధించినట్టు కాదన్నారు రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీని వీడి చరిత్రాత్మక తప్పిదం చేశానని అన్నారు. తన తల్లి చనిపోతే కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించలేదని వాపోయారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి తలతిక్క మాటలు మానుకోవాలని హితవు పలికారు.
దిగ్విజయ్ సింగ్ తో పడకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు డీఎస్. దిగ్విజయ్ తనపై సోనియాకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో మనస్తాపంతో పార్టీని వీడానన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇష్టం లేకున్నా తన సస్పెన్షన్ తీర్మానంపై సంతకాలు చేశారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com