133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కివీస్ జట్టు

X
TV5 Telugu26 Jan 2020 4:12 PM GMT
న్యూజిలాండ్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ బౌలర్ల దాటికి కివీస్ జట్టు విలవిలలాడింది. తొలి టీ20లో పరుగుల వర్షం కురిపించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు రెండో టీ20లో మాత్రం 132 పరుగులతో సరిపెట్టుకున్నారు. టిమ్ సీఫెర్ట్, మార్టిన్ గప్టిల్ లు కొత్త వరకు స్కోర్ బోర్టును నిలబెట్టినా.తరువాత ఆటగాళ్లు మాత్రం భారత్ బౌలర్ల దాటికి నిలవలేకపోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా2, దుబె1 , ఠాకూర్1, బుమ్రా1 వికెట్లు తీశారు. అటు షమీ, చహల్‌లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో 133 పరుగులు స్వల్ప లక్ష్యంతో కొహ్లీసేన బరిలో దిగింది.
Next Story