చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా.. కాకి బిర్యానీ వడ్డిస్తున్నారేమో చూస్కోండి..

చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తున్నారా.. కాకి బిర్యానీ వడ్డిస్తున్నారేమో చూస్కోండి..
X

ఎంత నాన్‌వెజ్ తింటే మాత్రం కాకులను, కుక్కలను ఎలా తింటారండి అని అడిగితే ఏం చెప్పాలి.. మరి వాటిని కూడా వండి వడ్డించేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం రాకుండా మసాలా దట్టించి, కొత్తిమీర చల్లి ఘుమ ఘుమలాడే వేడి వేడి బిర్యానీని కస్టమర్ ముందు పెడితే ఏమాత్రం అనుమానం లేకుండా లాగించాలని ఎందుకు అనిపించదు.

తమిళనాడు రోడ్లపై అమ్మే బిర్యానీ కాకి మాంసంతో తయారు చేస్తున్నారు. చికెన్ బిర్యానీ అనుకుని జనం దాన్ని తినేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారిపై నిఘా ఉంచారు. రామేశ్వరంలోని ఓ ఆలయానికి రోజూ ఓ వ్యక్తి వచ్చి కాకులకు బియ్యం గింజలు వేస్తున్నాడు. కాకులు ఆ బియ్యం గింజలు తిని స్పృహ తప్పి పడిపోవడం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. అలా స్పృహతప్పి పడిపోయిన కాకులను చంపి వాటిని చికెన్ పేరుతో విక్రయిస్తున్నారు. దాంతో బిర్యానీ తయారు చేస్తున్నారు.

తమిళనాడులోనే 2016లో ఓ సారి పిల్లుల మాంసాన్ని మటన్ పేరుతో విక్రయించారు. పోలీసులు వలపన్ని వారిని పట్టుకున్నారు. ఇక్కడ నివసిస్తున్న నరికురవా అనే వర్గం పిల్లులను ఆహారంగా తీసుకుంటారు. ఇటీవల ఓ పెళ్లి భోజనం కోసం సిద్దం చేసిన 20 పిల్లుల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES