తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు.. క్యాబినెట్‌లోకి కేరళ ఐజీ?

తెలంగాణ మంత్రి వర్గంలో మార్పులు.. క్యాబినెట్‌లోకి కేరళ ఐజీ?

తెలంగాణ మంత్రి వర్గంలో త్వరలో మార్పులు చేర్పులు జరగనున్నాయా? ఒకరిద్దరిని సాగనంపి కొత్త వారికి చోటు కల్పించబోతున్నారా? దీనికి అవుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. కేరళ ఐజీ , ఖమ్మం జిల్లాకు చెందిన జి. లక్ష్మణ్‌ను సీఎం కేసీఆర్‌ తన కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. కేటీఆర్‌ వద్ద ఉన్న ఐటీ శాఖను లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం కేరళలో పనిచేస్తున్నప్పటికీ, సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2009, 2014, 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్‌పై పోటీ చేయాలని కోరినా నిరాకరించానని.. కానీ ఇప్పుడు మంత్రివర్గంలో చేరబోతున్నట్లు సన్నిహితుల వద్ద లక్ష్మణ్‌ ప్రస్తావించినట్లు సమాచారం. మరో 14ఏళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నానని.. ఇప్పటికే కేరళ డీజీపికి సమాచారం అందించినట్లు లక్ష్మణ్ దృవీకరించారు. ఇదే విషయంపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది.

1997 బ్యాచ్‌కు చెందిన లక్ష్మణ్.. మాజీ డీజీపీ డి.టి నాయక్‌ అల్లుడు. కేరళ క్రైం బ్రాంచ్‌, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కేరళ ట్రాఫిక్‌, సోషల్ పోలీసింగ్‌ విభాగం ఇన్‌ స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్ BSE ఎస్‌ఎంఈ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

Tags

Read MoreRead Less
Next Story