గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్

గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్

చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే భారత్ ను తాకింది. కేరళలో ముగ్గురు అనుమానితులకు వ్యాధి నిర్ధారణ కూడా అయ్యింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అలర్టయింది. గాంధీ ఆసుప్రతిని నోడల్ కేంద్రంగా గుర్తంచి.. అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేసింది. అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరపుతున్నారు. ఇక కరోనా అనుమానితుల కోసం గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. అంతేకాదు, ప్రత్యేకంగా ఒక లిఫ్ట్ కేటాయించి.. అనుమానితులను డైరెక్ట్ గా ఏడవ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన కరోనా వార్డుకు తరలిస్తున్నారు. షిఫ్టులవారిగా సిబ్బందిని అందుబాటులో వుంచారు.

కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా వున్నామని.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ అన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందజేస్తున్నామని తెలిపారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం పంపుతున్నామని.. కరోనా అనుమానితులు ఎవ్వరు కూడా బయటికి వెళ్లకుండా ఏర్పాటు చేశామని అన్నారు. అంతేకాకుండా, కరోనా బాధితుల కోసం స్పెషల్ లిఫ్ట్ ఏర్పాటు చేశామని.. గాంధీ వైద్యులకు శిక్షణ కూడా ఇచ్చామని శ్రావణ్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story