సోషల్ మీడియాలో తనను వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన టీడీపీ వీరాభిమాని

పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ వీరాభిమానికి సోషల్ మీడియాలో వేధింపులు పెరగడంతో పోలీసులు ఆశ్రయించారు. ఏలూరుకు చెందిన ఉండవల్లి అనూష టీడీపీ అభిమాని కావడంతో.. ఆ పార్టీ పరమైన కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతోపాటు వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన వివిధ జీవోలు, పథకాల్లో తప్పొప్పులపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. అయితే ఇటీవల గుంటూరుకు చెందిన మానుకొండ రామిరెడ్డి అనే వ్యక్తి తనకు వ్యతిరేకంగా పోస్టింగ్‌లు పెడుతూ.. అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు బెదిరిస్తున్నారని అనూష పోలీసులను ఆశ్రయించారు. తన ఫేస్ బుక్ నుంచి ఫోటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని అనూష ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుల మద్దతుతో అనూష మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com