రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుందని భయపడుతున్నారు: నారా లోకేష్

ఐటీ దాడుల విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు.. వారు ఇచ్చిన పత్రికా ప్రకటన ద్వారానే అర్థమైందని మండిపడ్డారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. జగన్‌కు లోకమంతా అవినీతిగా కనపడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమి లేదని లోకేష్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 85 లక్షలు దొరికాయని ఐటీ శాఖ చెబితే.. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో 2 వేల కోట్లు దొరికాయని తప్పుడు ప్రచారం చేస్తూ.. వైసీపీ నేతలు శునకానందం పొందుతున్నారని విమర్శించారు.
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుందన్న భయం జగన్ వెంటాడుతుందన్నారు లోకేష్. ఇన్ఫ్రా కంపెనీల్లో జరిగిన ఐటీ రైడ్స్‌కి టీడీపీకి ముడిపెట్టాలని తెగ తాపత్రయ పడుతున్నారని అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి.. అందరూ తనలా జైలుకి వెళ్లాలని కోరుకోవడం సహజమే అయినా.. అలాంటి కోరికలు తమకు లేవన్నారు లోకేష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com