రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంది.. కానీ.. : పవన్

రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రప్రభుత్వం చేతిలో ఉంది.. కానీ.. : పవన్

రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని అయితే.. ఆ నిర్ణయం 2014లో జరిగిపోయిందన్నార పవన్‌ కల్యాణ్‌. తుళ్లూరులో రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన పవన్.. రాష్ట్రానికి కేంద్రానికి లిఖిత పూర్వకంగా సంభాషణలు జరుగుతాయన్నారు. కానీ... మూడు రాజధానులపై అలాంటి సంభాషణలు ఎక్కడా జరగలేదన్నారు. కేంద్రానికి చెప్పి చేస్తున్నామనేది వాస్తవం కాదన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు వైసీపీ నేతలు ఆ మాటలు మాట్లాడుతున్నారు. మూడు రాజధానులకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని తనకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారన్నారు.

ప్రజాక్షేమం కోరుకున్న ఏ ప్రభుత్వం రాజధాని తరలించదన్నారు. రాజధాని తరలించడం ఎవరికి ఆమోదయోగ్యం కాదన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వమే మోసం చేయడం దారుణమని.. రాజధాని అంశం ఏ ఒక్క సామాజిక వర్గ సమస్య కాదని చెప్పారు. రాయపూడిలో రైతులను కలిసిన పవన్‌.. రాజధాని రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story