కేంద్రం మెడలు వంచుతాం అన్నారు.. మోదీ ముందు తలవంచుతున్నారు: బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి

X
TV5 Telugu20 Feb 2020 2:20 PM GMT
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. ఉన్న పెన్షన్, రేషన్‌కార్డులను తొలగిస్తున్న నమ్మక ద్రోహి.. జగన్ అంటూ విమర్శంచారు ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి. కర్నూలు జిల్లా సొగగూరులో.. ప్రజా చైతన్యయాత్రకు శ్రీకారం చుట్టారాయన. ఈ సందర్భంగా ప్రసంగించిన బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి.. వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఆర్డీఎస్ కాల్వల టెండర్లు సైతం రద్దు చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్... ఇప్పుడు మోదీకి తలవంచుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కర్నూలుకు వస్తే.. ప్రభుత్వ స్కూళ్లకు ఎందుకు సెలవు ఇచ్చారని ప్రశ్నించారాయన.
Next Story