ఇది నవ 'మోసాల' పాలన: నారాలోకేష్

X
జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. వైసీపీ సర్కారు 9 నెలల పాలనను విమర్శిస్తూ... నవ మోసాల పాలన అంటూ ఎద్దేవా చేశారు. జగన్ పాలన 9 రద్దులు, 9 భారాలు, 9 మోసాలుగా వర్ణించారు లోకేష్. ప్రజాచైతన్య యాత్రలో వీటిపై సర్కారును నిలదీస్తామన్నారు.
అంతకుముందు జగన్ పాలనను తుగ్లక్ పాలనతో పోల్చారు. తుగ్లక్ నిర్ణయాలతో నిన్నటి దాకా ప్రైవేట్ పెట్టుబడులు వెళ్లిపోయాయని.. ఇప్పుడు ప్రభుత్వ సంస్థల వంతు వచ్చిందని విమర్శించారు. ఆంధ్రుడు ఏం పాపం చేశాడని.. ఈ అపఖ్యాతి మూటగట్టుకున్నాడని ప్రశ్నించారు. ఓఎన్జీసీ తరలి పోతుందంటూ వార్తలు వస్తుండటంతో ఆయన ఈ ట్వీట్ చేశారు. ఆ వార్తల క్లిప్పింగును తన ట్వీట్‌కు లోకేశ్ జత చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
