విశాఖ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అరెస్ట్

విశాఖ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అరెస్ట్

విశాఖ ఎయిర్‌పోర్టులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు యాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో ఆందోళన చేపట్టిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన ప్రతిఘటించడంతో బలవంతంగా అరెస్టు చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా పైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వాసుపల్లి స్పందన తెలుసుకోడానికి ప్రయత్నించిన రిపోర్ట్‌ దగ్గరి నుంచి లోగో బలవంతంగా లాక్కున్నారు.

Tags

Read MoreRead Less
Next Story