వైసీపీ దాడులపై చంద్రబాబు ఆగ్రహం

వైసీపీ దాడులపై చంద్రబాబు ఆగ్రహం
X

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్న దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులను ఇలాగే చంపేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ నేత బోండా ఉమకు ఫోన్‌ చేసిన చంద్రబాబు అక్కడి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మాచర్లలో అధికార పార్టీ దుర్మార్గంగా వ్యవహరించిందని బుద్దా వెంకన్న.. చంద్రబాబుకు వివరించారు. అడుగడుగునా వైసీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని.. రాళ్ల దాడి చేస్తున్నారని.. పోలీసు వాహనాలను సైతం ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబుకు బుద్దా వెంకన్న వివరించారు.

Tags

Next Story