కేంద్రప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం.. ఐపీఎల్ నిర్వహణపై అనుమానం

విదేశీ టూరిస్టులకు వీసాలు ఆపేస్తూ కేంద్రం కీలకం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో స్వయంగా విదేశాంగ శాఖ సహాయమంత్రి జైశంకర్ ప్రకటించారు. నేటి నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి వీసాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. నిన్ననే కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిందని.. దీంతో మరింత అప్రమత్తంగా ఉండాలి అన్నారు. అత్యవసరం అయితే.. తప్పా ఎవరూ విదేశాలకు వెళ్లొద్దని కోరారు. ఇప్పటికే భారత్‌లో 73 కరోనా కేసులు నమోదయ్యాయని.. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని హామీ ఇచ్చారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఐ.పి.ఎల్‌పై ప్రభావం చూపనుంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్ కు కరోనా ఎఫెక్ట్ గట్టిగా తగిలింది. ఏప్రిల్ 15 వరకు విదేశీ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మెగా ఈవెంట్ నిర్వహణ అనుమానమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com