Top

స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు, అరాచకాలపై టీడీపీ న్యాయ పోరాటం చేస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. అధికార పార్టీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేసింది. కేంద్ర బలగాల సాయంతో పలు చోట్ల ఎన్నికలు నిర్వమించాలని కోరింది. 13 జిల్లాల పరిధిలోని 154 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు రీషెడ్యూల్‌ చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనూ నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆరు జెడ్పీటీసీ స్థానాల్లోనూ నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదని కంప్లయింట్‌ చేసింది. ఈ ఆరు చోట్ల ఎన్నిక రీ షెడ్యూల్‌ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్‌ చేశారు. అలాగే రాష్ట్రంలో పలుచోట్ల ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు వేయకుండా టీడీపీ అభ్యర్థులను అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు, నామినేషన్‌ పత్రాల చింపివేత వంటి చర్యలపైనా టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

Next Story

RELATED STORIES