30 మంది సలహాదారులు అవసరమా?: సీపీఐ రామకృష్ణ

X
TV5 Telugu16 March 2020 5:10 PM GMT
తొమ్మిది నెలలోనే జగన్ దుర్మార్గపు పాలన ప్రజలకు అర్థమైందన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆంధ్రుల రాజధాని అమరావతిని ద్వంసం చేసేందుకు కట్రపన్నారని మండిపడ్డారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతుల మద్దతు తెలిపిన ఆయన.. మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపేట్టేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాటాడితే రైతులు, మహిళలపై కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలు, 30 మంది సలహాదారులు ఎందుకు అని రామకృష్ణ ప్రశ్నించారు.
Next Story