కరోనా నుంచి భక్తులకు ముప్పు లేకుండా టీటీడీ చర్యలు

కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ముప్పు లేకుండా రక్షణ చర్యలు చేపట్టింది టీటీడీ. అయితే శ్రీవారికి ప్రతి రోజూ నిర్వహించే ఆర్జిత సేవలను మాత్రం ఆగమశాస్త్రం ప్రకారం ఏకాతంగా నిర్వహించే అవకాశం ఉందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు. ప్రతినిత్యం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారని.. స్వామి వారి దర్శనార్థం ఎక్కువమంది భక్తులు గుమ్మిగూడే అవకాశం ఉండడంతో ఆలయంలో మలయప్ప స్వామికి నిర్వహించే కల్యాణోత్సవంను ఏకాంతంగా నిర్వహిస్తున్నామన్నరు. అలాగే సహస్రకళసాభిషేకం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, విశేష పూజ, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేస్తున్నట్టు తెలిపారు. మూలవర్లకు నిర్వహించే నిత్య కైంకర్యాలు సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకూ జరిగే ఉపచారాలు ఆమోక్తంగా ప్రతినిత్యం నిర్వహిస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com