ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అఖిలపక్ష నేతలు

ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అఖిలపక్ష నేతలు

స్థానిక ఎన్నికల ప్రక్రియలో దాడులు, కరోనా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కి అఖిలపక్షం నేతలు ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షం నేతలు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికల ప్రక్రియ జరగడంలేదని వివరించారు. SEC రమేష్‌కుమార్‌కు కులం పేరుతో సీఎం జగన్‌తో పాటు మంత్రులు, వైసీపీ నేతలు దూషిస్తున్నారని గవర్నర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల కమిషనర్‌కు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోరారు.

ప్రతిపక్ష సభ్యులను బెదిరించి బలవంతంగా అధికార వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు యథేచ్చగా అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. జగన్‌ సీఎంగా ఎన్నికలు జరిగితే ప్రజలకు, ఇతర పార్టీల నేతకు భద్రత ఉండదని విన్నవించారు. ఏపీ రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర బలగాలతో ఎన్నిలకు నిర్వహించాలని అఖిల పక్షం నేతలు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story