విదేశీయుల వివరాలు ఆరా తీస్తున్న తెలంగాణ అధికారులు

కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో అధికారులు అలర్టయ్యారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే వైరస్ లక్షణాలు కనిపిస్తుండటంతో వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ లోని పాతబస్తీకి ఇతర దేశాలనుంచి వచ్చిన వారి వివరాలపై దృష్టిపెట్టారు. విదేశాల నుంచి వచ్చి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఉన్న వాళ్లగురించి ఆరాతీస్తున్నారు. కజకిస్తాన్, ఇండోనేషియా, దుబాయ్ దేశాలనుంచి పాతబస్తీకి వచ్చిన వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చి ఇళ్లలో ఉన్నవాళ్లలో ఎవరికైనా వైరస్ ఉందా.. ఉంటే వారు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు అనే దానిపై ఆరా తీయనున్నారు.
వారం రోజులక్రితం ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన మత ప్రభోదకుల్లో 8మందికి కరోనా వైరస్ సోకడంతో రాష్ట్రప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా ఇతర దేశాలనుంచి వచ్చి సెల్ప్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఉన్నవాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. వీరి ద్వారా వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com