తాజా వార్తలు

కరీంనగర్‌లో హైఅలర్ట్.. ఇంటింటిటా కరోనా పరీక్షలు

కరీంనగర్‌లో హైఅలర్ట్.. ఇంటింటిటా కరోనా పరీక్షలు
X

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఇండోనేషియా బృందం కరీంనగర్ లో పర్యటించడంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు వైద్యశాఖ అధికారులతో బీసీ సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. శుక్రవారం నుంచి ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. ప్రార్థనామందిరాలకు వెళ్లొద్దని సూచించారు.

ఇక, ఇండోనేషియా బృందం కలెక్టరేట్ సమీపంలో 48 గంటల పాటు పర్యటించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కు మూడు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇంటింటా పరీక్షలు నిర్వహించేందుకు వంద బృందాలను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ శశాంక తెలిపారు. ఇంటింటా పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అందరూ ఇళ్లలోనే ఉండి సహకరించాలని సూచించారు. అంతేకాదు, పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని.. వ్యాపార సంస్థలు మూసివేయాలని పిలుపునిచ్చారు.

Next Story

RELATED STORIES