ట్విట్టర్‌లో చెర్రీ.. తొలి ట్వీట్ తో ఫాన్స్ ఫిదా!

ట్విట్టర్‌లో చెర్రీ.. తొలి ట్వీట్ తో ఫాన్స్ ఫిదా!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగా.. అదే బాటాలో తనయుడు చెర్రీ కూడా ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించాడు. అయితే లేటెస్ట్‌గా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చెర్రీ త‌న తొలి పోస్ట్ షేర్ చేశాడు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా సర్కార్ కి త‌న వంతు సాయం అందించ‌బోతున్న‌ట్టు వెల్లడించాడు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు పీఎం సహాయనిధికి రూ.70 లక్షలు విరాళం అందిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించాడు. బాబాయ్ బాటాలోనే చెర్రీ విరాళం ప్రకటించడంతో మెగా ఫాన్స్ ఫిదా అవుతున్నారు.

Next Story

RELATED STORIES