ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్ మోగిస్తున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. క్షణక్షణానికి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే లక్ష కొత్త కేసులు నమోదయ్యాయి. 48 గంటల్లోనే 4 లక్షల నుంచి పాజిటివ్ కేసులు 5 లక్షలకు చేరాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల 32 వేల 224 కేసులు నమోదయ్యాయి. వైరస్‌ మరణాల సంఖ్య 24 వేలు దాటిపోయాయి. 1 లక్షా 24 వేల 326 మంది రికవరీ కాగా.. 3 లక్షల 83 వేల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అటు.. అమెరికాలో ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్యలో చైనా, ఇటలీని అమెరికా దాటిపోయింది. 85 వేల 594 కేసులతో అగ్రస్థానంలో అగ్రరాజ్యం ఉంది. 81 వేల 340 కేసులతో చైనా రెండో స్థానంలో.. 80 వేల 589 కేసులతో 3వ స్థానంలో ఇటలీ కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో స్పెయిన్, జర్మనీ, ఇరాన్, ఫ్రాన్స్ ఉన్నాయి.

8 వేల 215 మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా.. 4 వేల 365 మరణాలతో స్పెయిన్‌ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, ఇరాన్, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికి.. 727 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story