తాజా వార్తలు

నిత్యావసరాలకు యువకులు మాత్రమే వెళ్లండి: డిప్యూటీ సీఎం

నిత్యావసరాలకు యువకులు మాత్రమే వెళ్లండి: డిప్యూటీ సీఎం
X

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్ డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 37 పోలీస్ స్టేషన్లలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎవరూ బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. అటు సైబరాబాద్ కమిషనర్ సీపీ సజ్జనార్ కిందిస్థాయి పోలీసులకు పలు సూచనలు చేశారు. మరోవైపు లాక్ డౌన్ పరిస్థితులను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో పోలీసులు అన్ని ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారని అన్నారు. నిత్యావసరాల కోసం వృద్ధులు, మహిళలు, పిల్లలు బయటికి రావొద్దని సూచించారు. యువకులు మాత్రమే బయటికి వచ్చి నిత్యావసరాలు తీసుకెళ్లాలని అన్నారు. ఎమర్జెన్సీ వుంటే తామే సరఫరా చేస్తామని తెలిపారు.

Next Story

RELATED STORIES