కరోనా గుట్టు విప్పడంలో ఇండియా శాస్త్రవేత్తలు ముందడుగు

కరోనా గుట్టు విప్పడంలో ఇండియా శాస్త్రవేత్తలు ముందడుగు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి గుట్టు విప్పడంలో ఇండియా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. కరోనాకు సంబంధించిన మైక్రోస్కోప్ చిత్రాలను రిలీజ్ చేశారు. ట్రాన్స్‌మిషన్‌ ఎలక్ట్రాన్‌ మైక్రోస్కోప్‌ ఇమేజింగ్‌ ద్వారా భారత్‌లో తొలిసారి ఈ వైరస్‌ చిత్రాలను రూపొందించారు. జనవరి 30న కేరళలో నమోదైన తొలి కరోనా బాధితురాలి నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా వీటిని చిత్రించారు.

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పరిణామ క్రమం, దాని రూపాంతరం,ని ర్మాణం తదితర అంశాలపై సంపూర్ణ స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఇండియన్ శాస్త్రవేత్తలు.. కరోనావైరస్ లాంటి కణాల లక్షణాలను కలిగి ఉన్న మొత్తం ఏడు నెగటివ్ స్టెయిన్ వైరస్ కణాల నమూనాలను చిత్రీకరించారు.

'మెర్స్‌', 'సార్స్‌', తాజా కొవిడ్‌19కు దగ్గరి పోలికలు ఉన్నాయని ఈ చిత్రాల ద్వారా తెలుస్తున్నదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా పరివర్తనాన్ని అధ్యయనం చేసేందుకు ఈ చిత్రాలు ఉపయోగపడుతాయని వారు తెలిపారు. అలాగే జెనెటిక్‌ మూలాలు, వైరస్‌ ఎలా రూపాంతరం చెందుతున్నదో గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. జంతువుల నుంచి మనుషులకు.. మనుషుల నుంచి మనుషులకు వైరస్‌ ఎలా సంక్రమిస్తున్నదో ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story