కోవిడ్ కాటుకు బలైన స్పెయిన్ యువరాణి..

X
TV5 Telugu29 March 2020 2:25 PM GMT
స్పెయిన్ యువరాణి మరియా తెరెసా కరోనా కాటుకు బలైయ్యారు. మార్చి 26న కరోనా వైరస్ టెస్టులు చేయగా పాజిటివ్ అని తేలింది. ఆమె వయసు 86 ఏళ్లు. కాగా, స్పెయిన్‌లో ఇప్పటివరకు 73 వేల కరోనా కేసులు నమోదుకాగా అందులో 5982 మంది ప్రాణాలు విడిచారు. యువరాణి మరణించిన వార్త ఆమె సోదరుడు ప్రిన్స్ సిక్సె ఎన్రిక్ డి బోర్బన్, డ్యూక్ ఆఫ్ ఆరంజ్యూజ్ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. కరోనా వైరస్ వలన మరణించిన మొదటి రాయల్ ఆమె. కోవిడ్ కాటుకు బలవుతున్నవారిలో అధిక సంఖ్యలో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు ఉంటున్నారు.
Next Story