కరోనాతో మృతి చెందిన జపాన్ కమెడియన్

కరోనాతో మృతి చెందిన జపాన్ కమెడియన్

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. దీనిదాటికి వేల సంఖ్యలో ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచంలో పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి కబళిస్తుంది.

తాజాగా జపాన్ దేశానికి చెందిన కమేడియన్ కెన్ షిమురా కరోనా వైరస్‌తో మరణించారు. 70 ఏళ్ల వయసున్న ఆయన.. మార్చి 20వతేదీన జ్వరం, నిమోనియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. మార్చి 23వతేదీన కరోనా వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. చికిత్ప పొందుతూ నిమోనియా తీవ్రత పెరగడంతో మరణించారని వైద్య సిబ్బంది సోమవారం తెలిపారు.

టోక్యో నగరంలోని హిగాషిమూరయమా ప్రాంతానికి చెందిన కెన్ షిమురా జపాన్ దేశంలో కరోనా వైరస్ సోకిన మొట్టమొదటి సెలబ్రిటీ. ఈయన 1974లో జపాన్ కామిక్ సిరీస్ గ్రూప్ డ్రిఫ్టర్ కు ఐకాన్ గా నిలిచారు. పలు టీవీ కామెడీ షోలలో కూడా పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story