తాజా వార్తలు

తెలంగాణాలో కరోనా దాటికి ఆరుగురు మృతి

తెలంగాణాలో కరోనా దాటికి ఆరుగురు మృతి
X

తెలంగాణలో కరోనా బారినపడి ఆరుగురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్‌ విడుదల చేసింది. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, అపోలో ఆసుపత్రిలో ఒకరు, గ్లోబల్ ఆసుపత్రిలో ఒకరు, నిజామాబాద్‌లో ఒకరు, గద్వాలలో ఒకరు మరణించారని తెలిపారు. ఢిల్లీలో మర్కజ్ లో మార్చి 13 నుంచి 15 వరకు మతపరమైన ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి చాల మంది హాజరైయ్యారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న కొందరికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వీరంతా చికిత్స పొందుతూ మరణించారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో వీరు తిరిగిన ప్రాంతాలలో వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని వైద్యఆరోగ్య శాఖ భావిస్తోంది. దీంతో అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొంది.

Next Story

RELATED STORIES