కరోనా కట్టడికి రూ. 100 కోట్లు ప్రకటించిన భారతీ ఎంటర్‌ప్రైజెస్

కరోనా కట్టడికి రూ. 100 కోట్లు ప్రకటించిన భారతీ ఎంటర్‌ప్రైజెస్

కరోనా మహమ్మారితో యుద్దానికి ప్రతి ఒక్కరూ నడుంబిగిస్తున్నారు. అన్ని వర్గాల నుంచి విరాళాలు అందుతున్న్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు వందల కోట్ల విరాళాలను పీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తూ తమ వంతుగా సాయమే చేస్తున్నారు.తాజాగా భారతీ ఎంటర్‌ప్రైజెస్ కూడా 100 కోట్ల విరాళం ప్రకటించింది. భారతీ సంస్థ తన కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, భారతీ ఇన్‌ఫ్రాటెల్ తదితర కంపెనీలన్నింటి భాగస్వామ్యంతో.. కొంత మొత్తాన్ని పీఎం రిలీఫ్ ఫండ్‌లో జమ చేసింది. మిగిలిన మొత్తంతో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, వ్యక్తిగత రక్షక వైద్య పరికరాలు, వెంటిలేటర్లు వంటి ముఖ్యమైన పరికరాలను సమకూర్చనుంది. దాదాపు 10 లక్షల ఎన్-95 మాస్కులను విధానంలో సేకరించి అందుబాటులోకి తేనుంది.

అంతే కాకుండా ఆ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా తమ వంతుగా విరాళాలు అందించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story