యుద్ధ‌నౌక‌లో కరోనా వ్యాప్తి.. కాపాడాల‌ని కెప్టెన్ అభ్య‌ర్థ‌న‌

యుద్ధ‌నౌక‌లో కరోనా వ్యాప్తి.. కాపాడాల‌ని కెప్టెన్ అభ్య‌ర్థ‌న‌

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోన మహమ్మారి అమెరికాలో విజృభిస్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌక థియోడ‌ర్ రూజ్‌వెల్ట్ లో 4000 మంది చిక్కుకుపోయారు. ఈ తరుణంలో సైనికుల ప్రాణాలు కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని యుద్ధ నౌక కెప్టెన్‌ నౌకాదళ అధినాయకత్వాన్ని కోరారు. షిప్‌లో ఉన్న సుమారు 100 మంది సిబ్బందికి ఇప్ప‌టికే క‌రోనా పాజిటివ్ తేలింద‌ని, వెంట‌నే త‌మ‌ను ర‌క్షించాలంటూ కెప్టెన్‌.. పెంట్‌గాన్‌కు లేఖ రాశారు. ఇప్పుడు మేమేమీ యుద్ధం చేయ‌డం లేద‌ని, నావికులు ప్రాణాలు కోల్పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని పెంట‌గాన్‌కు రాసిన లేఖ‌లో కెప్టెన్ బ్రెట్ క్రోజ‌ర్ తెలిపారు. నేవీ యుద్ధ‌నౌక‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌ర్నీ క్వారెంటైన్ చేయాల‌ని ఆయ‌న వేడుకున్నారు. వైర‌స్ సోకిన వారిని షిప్‌లో ఐసోలేట్ చేయ‌డం ఇబ్బందిగా ఉంద‌ని ఆయన వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story