రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై ఆయన చర్చించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మహారాష్ట్రలో పరిస్థితిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే కు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1965కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

Next Story

RELATED STORIES