గురువారం అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్

X
TV5 Telugu1 April 2020 8:03 PM GMT
దేశంలో ప్రాణాంతక కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా మర్కజ్ నిజాముద్దీన్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
కరోనా నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, కరోనా కట్టడికి అవలంబిస్తున్న మార్గాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకోనున్నారు. అలాగే, కరోనా కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎంల నుంచి సలహాలు సూచనలు స్వీకరించడంతో పాటు రాష్ట్రాలకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ‘నిజాముద్దీన్’ వ్యవహారంపై కూడా సీఎంలతో మోదీ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story