దారుణం.. కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

దారుణం.. కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య
X

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో కూడా ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకుతుందనే భయంతో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటువంటి ఘటనే జరిగింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి ఇటీవల రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు విని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ఈ డిప్రెషన్ మరింత పెరిగిపోవడంతో.. అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా సోకుతుందనే భయంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story

RELATED STORIES