కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కేంద్రమంత్రుల కీలక భేటీ

కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో కేంద్రమంత్రుల కీలక భేటీ
X

న్యూ ఢిల్లీలోని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. దేశంలో క‌రోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో.. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై మంత్రులు చ‌ర్చించారు. కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు, కేంద్రం ఆదేశాల అమలు, లాక్‌డౌన్‌ అమలవుతున్న విధానం, ఇక ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు త‌దిత‌ర అంశాల‌పై ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తుంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో.. అందుకు గ‌ల కార‌ణాలు, నివారణ చ‌ర్య‌లపై కూడా మంత్రుల భేటీలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశంలో రాజ్‌నాథ్‌తోపాటు, హోంమంత్రి అమిత్‌షా, ఇత‌ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, గిరిరాజ్‌సింగ్‌, సంతోష్ గంగ్వార్‌, కిషన్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES