మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌.. ఇద్దరు భారత జవాన్లకు గాయాలు

మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌.. ఇద్దరు భారత జవాన్లకు గాయాలు
X

కరోనా వైరస్ ఒకవైపు ప్రపంచ దేశాల్లో విజృభిస్తుంటే.. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తలను పెంచేందుకు పాకిస్థాన్ యత్నిస్తోంది. గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో ఉన్న పూంచ్ జిల్లాలోని బాలాకోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు.

పాక్‌ జరిపిన కాల్పుల్లో ఇండియన్‌ ఆర్మికి చెందిన ఇద్దరు సైనికులు గాయపడ్డారు. బాలాకోట్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఈ ఘటనలో 14 పంజాబ్‌ రెజిమెంట్‌కు చెందిన నాయిబ్‌ సుబేదార్‌ సత్పాల్‌, హవల్దార్‌ ధర్మపాల్‌ గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని అధికారులు తెలిపారు. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచిందని.. అయితే పాక్‌ కాల్పులను తీవ్రంగా ప్రతిఘటించామని అధికారులు ప్రకటించారు

Next Story

RELATED STORIES