చైనాపై చర్యలు తీసుకోవాలి: అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి

చైనాపై చర్యలు తీసుకోవాలి: అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మూల కారణం చైనా అని ప్రపంచం మొత్తం ముక్త ఖంఠంతో వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయకోవిదుల మండలి (ఐసీజే) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్ఆర్‌సీ)ని కోరింది. కరోనా వైరస్‌ను ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర నష్టం చేసిందని.. అంటే మానవాళికి వ్యతిరేకంగా చైనా తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టేనని ఆరోపించింది.

యూఎన్‌హెచ్ఆర్‌సీకి లండన్‌లోని ఐసీజే అధ్యక్షుడు, ఆలిండియా బార్ అసోసియేషన్ చైర్మన్ అదిష్ సీ. అగర్వాలా ఫిర్యాదు చేశారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ వలన ప్రపంచ దేశాలు భారీగా నష్టపోయాయని.. కనుక.. అసాధారణ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని కోరారు. మరీ ముఖ్యంగా భారతదేశానికి భారీ నష్టపరిహారం చెల్లించాలని చైనాను ఆదేశించాలని డిమాండ్ చేశారు.

జీవ సంబంధ యుద్ధం ద్వారా ప్రపంచంలోని ఇతర దేశాలను అణగదొక్కి, తాను ప్రపంచంలో పెద్దన్న స్థాయికి చేరుకోవాలనేది చైనా లక్ష్యమని తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా వలన ప్రపంచం మొత్తం.. లక్ష కోట్ల డాలర్లు నష్టపోయిందని.. లక్షల మంది నిరుద్యోగులయ్యారని వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story