రైళ్ల పున:ప్రారంభంపై రైల్వే శాఖ కీలక ప్రకటన

రైళ్ల పున:ప్రారంభంపై రైల్వే శాఖ కీలక ప్రకటన

కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలో అన్ని రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. ముఖ్యంగా దేశంలో మొత్తం రైలు సర్వీసులను కూడా నిలిపి వేశారు. గూడ్స్ రైళ్లు మినహా మిగతా రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. అయితే ఈ నెల 14వ తేదీతో లాక్‌డౌన్ ముగుస్తున్న నేపథ్యంలో రైల్వే సేవల తిరిగి ప్రారంభంపై రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.

ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పున:ప్రారంభంపై ఈ నెల 12వ తేదీ తర్వాతే నిర్ణయం ప్రకటిస్తామని.. రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రైల్వే టికెట్ల బుకింగ్ ప్రక్రియ ఎప్పుడూ నిలిచిపోలేదని స్పష్టం చేసింది. 120 రోజుల ముందే టికెట్ల రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ముందు నుంచే ఉందని తెలిపింది. కేవలం లాక్‌డౌన్ అమల్లో ఉన్న తేదీల్లో మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 జరిగే ప్రయాణాలకు మాత్రమే బుకింగ్స్ ను రద్దు చేసినట్టు పేర్కొన్నది.

Tags

Read MoreRead Less
Next Story