రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం.. వాజ్‌పేయి స్పీచ్‌ను ట్వీట్‌ చేసిన మోదీ

రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం.. వాజ్‌పేయి స్పీచ్‌ను ట్వీట్‌ చేసిన మోదీ
X

ఆవో ఫిర్‌సే దియా జలాయే.. రండి.. తిరిగి దీపాలను వెలిగిద్దాం.. అంటూ భారతీయులకు పిలుపు ఇచ్చిని అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి స్పీచ్‌ను పీఎం మోదీ ట్వీట్‌ చేశారు. శనివారం మోదీ తన ట్విట్టర్‌లో.. ఆవో దియా జలాయే అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు.

కరోన మహమ్మారి భారత్‌పై పంజా విసిరింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు మోదీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తోంది. ఈ సమయంలో.. ఏప్రిల్‌ 5న రాత్రి 9 గంటల సమయంలో 9 నిమిషాలపాటు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లవద్దనే ఉండి ఇళ్లల్లోని విద్యుత్‌ లైట్లన్నీ ఆపేసి, జ్యోతులు వెలిగించి, తమ ధృఢ సంకల్పాన్ని వెల్లడించాలిని పీఎం మోదీ పిలుపునిచ్చారు. చమురు దీపాలు లేదా కొవ్వొత్తులు, టార్చ్‌లైట్లు లేదా సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లైట్లు.. ఏవి వీలైతే అవి వెలిగించి, కరోనా అనే చీకటిని, ఆ మహమ్మారిని తరిమేద్దాం అనే సంకల్పం తీసుకోవాలని మోదీ పేర్కొన్నారు. అయితే కరోనాపై పోరు సందర్భంగా మోదీ తన ట్విట్టర్‌లో.. వాజ్‌పేయి వినిపించిన ఓ కవితను పోస్టు చేశారు. 'ఆవో ఫిర్‌సే దియా జలాయే అంటూ దేశ ప్రజలకు పిలుపునిస్తూ.. వారిని చైతన్య పరిచేలా వాజ్ పేయి కవిత చెబుతారు. మన లక్ష్యం మన కళ్లకు కనిపించనంతదూరన వెళ్లిపోయినా కూడా నిరాశ చెందక రేపటి కోసం మనం జ్యోతి వెలిగించాలంటూ' వాజ్ పేయి చెప్పిన కవితను .. తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు మోదీ.

Next Story

RELATED STORIES