పద్మశ్రీ నిర్మల్‌సింగ్ కుమార్తెకు కరోనా

పద్మశ్రీ నిర్మల్‌సింగ్ కుమార్తెకు కరోనా
X

పద్మశ్రీ నిర్మల్‌సింగ్ కుమార్తెకు కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది. పద్మశ్రీ, సిక్కు ఆధ్యాత్మిక గాయకుడు నిర్మల్‌సింగ్ ఇటీవలే కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. నిర్మల్ సింగ్ విదేశాల నుంచి తిరిగివచ్చాక ఆయనకు కరోనా సోకి చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా ఆయన కుమార్తె కరోనా పరీక్షలు చేసుకోగా.. ఆమెకు పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఆమెను జలంధర్ నగరంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కరోనా సోకిన విషయం.. పంజాబ్ రాష్ట్ర ప్రత్యేక చీఫ్ సెక్రటరీ కరణ్ బీర్ సింగ్ సిద్ధూ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

మరో వైపు.. పంజాబ్ లో ఇప్పటివరకు 59 మందికి కరోనా సోకగా.. వారిలో ఐదుగురు మరణించారు.

Next Story

RELATED STORIES