మా నాన్న లాక్‌డౌన్‌ పాటించటం లేదు.. తండ్రిపై కుమారుడు పోలీస్‌లకు ఫిర్యాదు

మా నాన్న లాక్‌డౌన్‌ పాటించటం లేదు.. తండ్రిపై కుమారుడు పోలీస్‌లకు ఫిర్యాదు
X

కరోనాపై పోరాటానికి దేశం మొత్తం స్వీయ నిర్బంధంలో ఉంది. అయితే.. పలు చోట్ల ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. దీంతో అధికారులు, వారి చుట్టు పక్కల వారు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించటంలేదని.. ఢిల్లీలో ఓ వ్యక్తి .. తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రతి రోజు రాత్రి 8 గంటలకు బయటకు వెళ్తున్నాడని.. ఎన్ని సార్లు చెప్పినా వినడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. బయటకు వెళ్లిన అతని తండ్రిని ఇంట్లోకి వెళ్లమని చెప్పారు. అయితే ఆయన పోలీసుల మాట వినకపోవడంతో.. తండ్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Next Story

RELATED STORIES