లాక్‌డౌన్ వేళ రోడ్డుపైకి.. కారు ప్రమాదంలో హీరోయిన్..

లాక్‌డౌన్ వేళ రోడ్డుపైకి.. కారు ప్రమాదంలో హీరోయిన్..
X

శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ నటి షర్మిలా మాండ్రే ఆమె స్నేహితుడు లోకేష్ వసంత తీవ్ర గాయాలయ్యాయి. కారుకు జరిగిన డ్యామేజ్ చూస్తుంటే గాయలా తీవ్రత అర్థమవుతోంది. లాక్‌డౌన్ వేళ పోలీసుల కళ్లుగప్పి వాళ్లు బయటకు ఎలా వచ్చారో అనే కోణంలో దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. షర్మిలాకు చేతికి, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి.

సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ లోని వసంత్ నగర్ అండర్ బ్రిడ్జిలో జరిగిన ప్రమాదం గురించి తెల్లవారు జామున 3 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఓ వ్యక్తి వారిముందుకు వచ్చి నేనే కారు నడిపానని, లోపల నా స్నేహితులు ఉన్నారని, ఎటువంటి కేసు బుక్ చేయకుండా విడిచిపెట్టమని బతిమాలాడు. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నట్లు పోలీసులు అతడికి వివరించారు. మరికొద్ది సేపటికి కన్నిన్తమ్ రోడ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి పోలీసులకు కాల్ వచ్చింది.

దక్షిణ బెంగళూరులని జేపీ నగర్లో ప్రమాదం జరిగిందని గాయపడిన వ్యక్తులు ఆసుపత్రికి వచ్చినట్లు వివరించారు. దర్యాప్తును పక్కదారి పట్టించడానికే పోలీసు తప్పుడు సమాచారం అందిచారని పోలీసులు అనుమానిస్తున్నారు. లాక్డౌన్ నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి వారిద్దరూ జాలీ డ్రైవ్‌లో ఉన్నారని పోలీసులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ KA-51-MJ-2481 కలిగిన షర్మిల జాగ్వార్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story

RELATED STORIES