మహారాష్ట్రలో మరో 26 కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో మరో 26 కరోనా పాజిటివ్ కేసులు
X

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతుంది. ఆదివారం ఒక్కరోజే 26 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 661కి చేరింది. మరోవైపు కరోనా బారిన పడి ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందాడు. పుణెలోని ససూన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 52 ఏళ్ల వృద్ధుడు మృతి చెంది నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మహారాష్ట్రలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 11కు చేరింది.

Next Story

RELATED STORIES